అక్వాన్​ ఎఫెక్ట్​.. ఈ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

కలం, వెబ్ డెస్క్​: అర్నబ్​, మురసు తుఫాను నుంచి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం ఇంకా తేరుకోకముందే మరో మప్పు ముంచుకొస్తోంది. ‘అక్వాన్​’ గా నామకరణం చేసిన తుఫాను (Cyclone Akwan) ఏపీతో పాటు తెలంగాణపై కూడా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్​ లు జారీ చేసంది. తుఫాను ప్రభావంతో గంటకగ 40 నుంచి 50 కిలో మీటరల్ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

అక్వాన్​ తుఫాను కారణంగా ఈ నెల 21వ తేదీన ఈ నెల 21వ తేదీన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్​ నగర్​, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది. అలాగే, ములుగు, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్​, హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్​ ఇచ్చింది.

కాగా, తుఫాను (Cyclone Akwan) ముప్పు కోస్తాంధ్రలోనూ వర్షాలు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ అంచనా వేసింది. బుధవారం నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>