రేపు దేశవ్యాప్తంగా ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె

కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా రేపు (శనివారం) ఓలా, ఊబర్, ర్యాపిడో (Ride Hailing Services) డ్రైవర్లు సమ్మె (Nationwide Strike) చేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సమ్మె జరగనుంది. పెరుగుతున్న ఇంధన ధరలు, కమీషన్ తగ్గింపు, ఇతర వ్యాపార సమస్యలపై డ్రైవర్లు నిరసనగా ఆందోళన చేపట్టనున్నారు. సమ్మె కారణంగా వీలైనంత వరకు రైడ్స్ అందుబాటులో లేకపోవడం, ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. అలాగే నగరాల్లో రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని, ప్రత్యామ్నాయ వాహనాల కోసం ఏర్పాట్లు చూసుకోవాలని అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>