Mobile Popup Ad
Mobile Popup Ad

NDA నేతల విందులో సీఎం రేవంత్ : ఢిల్లీ వేదికగా ఆసక్తికర భేటీ!

కలం, వెబ్​ డెస్క్​ : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీఏ కూటమి నేతలు ప్రధానంగా హాజరైన ఈ సమావేశానికి (NDA Leaders Meeting) ముఖ్యమంత్రి ఒంటరిగా వెళ్లడం చర్చనీయాంశమైంది.

ఈ విందు కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖర్‌లతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఈ భేటీలో కనిపించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలందరూ ఒకే వేదికపై కలవడం, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read Also: లా కాలేజీ విద్యార్థులకు సీఎం సౌకర్యాలు కల్పించాలి: కవిత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>