Mobile Popup Ad
Mobile Popup Ad

లా కాలేజీ విద్యార్థులకు సీఎం సౌకర్యాలు కల్పించాలి: కవిత

కలం, వెబ్ డెస్క్: ప్రైమరీ స్కూల్ నిర్వహించేంత చిన్న భవనంలో లా కాలేజీ నడిపించే దుస్థితిలో మన విద్యావ్యవస్థ ఉండటం అత్యంత దురదృష్టకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) మండిపడ్డారు. హైదరాబాద్ మహా నగరానికి కూతవేటు దూరంలోని మాహాత్మా జ్యోతిబా పూలే కందుకూరు లా కాలేజీ (Kandukur Law College)ని కేవలం ఐదు గదుల్లో నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెసిడెన్షియల్ విద్యావ్యవస్థలో స్కూళ్లు, జూనియర్ కాలేజీలే కాదు ప్రొఫెషనల్ కాలేజీలు సైతం ఏర్పాటు చేశామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకోగా.. రెండున్నరేళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిలో కనీస సదుపాయాలు కల్పంచలేకపోయిందని దుయ్యబట్టారు. ఈ ఐదు గదుల్లో రెండు గదులను క్లాస్ రూములుగా, మూడు గదులను డార్మెటరీలుగా ఉపయోగిస్తున్నారని.. వాటిలో కనీస సదుపాయాలు లేవని చెప్పారు.

లా థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ లో రెండు నెలలుగా కరెంట్ లేదని.. దీంతో విద్యార్థులే కాదు అధ్యాపకులు సైతం అవస్థలు పడుతున్నారని కవిత (Kavitha) పేర్కొన్నారు. సెమిస్టర్ పరీక్షలను సైతం లా స్టూడెంట్స్ కరెంట్ లేని గదిలోనే రాయాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. కరెంట్ ఉన్న గదుల్లోనూ ఫ్యాన్లు సరిగా తిరగకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమీషన్లు తెచ్చిపెట్టే పనులపై తప్ప లా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పంచే పనులపై దృష్టిపెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రచార ఆర్భాటాలు మాని కందుకూరు రెసిడెన్షియల్ లా కాలేజీకి పక్కా భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు.

Read Also: డీలిమిటేషన్ బిల్లు ఆగిపోవడం చారిత్రాత్మకం: మంత్రి జూపల్లి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>