Mobile Popup Ad
Mobile Popup Ad

దోమలు మహాప్రభో.. హనుమకొండలో కాలనీ వాసుల వినూత్న నిరసన

కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanumakonda) లోని 54 డివిజన్ కి చెందిన కాలనీ ప్రజలు దోమలతో యుద్ధం చేస్తున్నామని దోమల బ్యాట్లు పట్టుకొని సోమవారం సాయంత్రం వినూత్న పద్దతిలో నిరసన తెలిపారు. ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకోవడం లేదని, దోమల నివారణకు ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దోమల కారణంగా పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడి ప్రాణాల కోల్పోయే దుస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలు డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారినపడుతున్నారన్నారు. హాస్పిటల్ కి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిపారు. కాలనీ వాసులు పడుతున్న సమస్యలను బీజేపీ నాయకులు పేరం గోపి కృష్ణ డివిజన్ లోని పలు కాలనీ వాసుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దోమల బెడదతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి కాలనీలోని సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ దోమల బ్యాట్లతో నిరసన తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>