Mobile Popup Ad
Mobile Popup Ad

దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్

కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దీక్ష చేపట్టారు. బుధవారం ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి కార్తీక మాసంలో దీక్షను పవన్ విరమిస్తారు. గురుముఖత దీక్ష స్వీకరించిన పవన్.. మంత్రోపదేశం చేశారు. దీక్ష సమయంలో నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణ చేయనున్నారు. నిత్యం అనుష్ఠానం, దేవతారాధన చేయనున్నారు. దీక్ష ముగిసే వరకు సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>