కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడం అంటే.. ఆ స్కీమ్ ను నిర్వీర్యం చేయడమే అన్నారు కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి (Renuka Chowdhury). సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని.. అభివృద్ధి చేయడం పక్కన పెట్టేసి సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు రేణుకా. అలాగే మహిళల బట్టలపై జరుగుతున్న వివాదం మీద కూడా రేణుకా చౌదరి స్పందించారు. ‘ఆడవారు ఎలాంటి బట్టలేసుకోవాలో చెప్పడానికి మీరెవరు. ఆడవారి హక్కులపై సోషల్ మీడియాలో దాడి జరిగితే సహించేది లేదు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిందే. ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాస్తే బాగుండదు. ఆడవారి హక్కులకు భంగం కలిగించాలని చూస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదు’ అంటూ రేణుకా చౌదరి సీరియస్ కామెంట్లు చేశారు.

Read Also: జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ నామినేషన్
Follow Us On : WhatsApp


