కలం, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ (Nitin Nabin) నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ సీనియర్ నేతలు భారీగా తరలివచ్చారు. నితిన్ నబిన్ తరఫున సీనియర్ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ లక్ష్మణ్‌తోపాటు పార్టీ సీనియర్ నేతలు నామినేషన్ పత్రాలను స్వీకరించారు.
నితిన్ నబిన్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి ముఖ్య నేతలు హాజరై నితిన్ నబిన్‌కు మద్దతు ప్రకటించారు. జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. సాయంత్రం వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది. సాయంత్రం నితిన్ నబిన్ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉంది. రేపు (మంగళవారం) నితిన్ నబిన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Read Also: మేడ్చల్‌లో రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
Follow Us On: X(Twitter)


