కలం, వెబ్ డెస్క్ : చాలా మంది హోమ్ లోన్ (Home Loan) తీసుకోడానికి ఎన్నో రకాల డాక్యుమెంట్లు బ్యాంకులకు సమర్పిస్తారు. కానీ లోన్ క్లియర్ చేశాక కీలకమైన డాక్యుమెంట్లను బ్యాంకుల నుంచి తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. లోన్ (Home Loan) కట్టేశామంటే కచ్చితంగా సేల్ డీడ్, టైటిల్ డీడ్, ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ను కచ్చితంగా బ్యాంకుల నుంచి తీసుకోవాలి. అయితే చాలా బ్యాంకులు ఈ డాక్యుమెంట్స్ ను కస్టమర్లకు ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్ లోనే ఉంచుతాయి.
ఇలా ఆలస్యం జరగొద్దనే ఉద్దేశంతో ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏ సందర్భంలో అయినా సరే బ్యాంకులు డాక్యుమెంట్లను 30 రోజుల్లోపు ఇచ్చేయాలి. 30 రోజులు దాటినా సరే ఇవ్వకపోతే.. రోజుకు రూ.5వేల చొప్పున కస్టమర్లకు బ్యాంకులు పెనాల్టీ కింద చెల్లించాలి. 2023 డిసెంబర్ 1 నుంచే ఈ రూల్ అమల్లో ఉంది. చాలా మందికి ఈ రూల్ గురించి తెలియక బ్యాంకులు ఆలస్యం చేసినా సరే పెద్దగా పట్టించుకోరు. కాబట్టి మీ డాక్యుమెంట్లు ఏమైనా బ్యాంకు వద్ద ఉన్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోండి.


