కలం, వెబ్డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం మేడారంలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు వన దేవతల ప్రాంగణానికి సీఎం రేవంత్ చేరుకొంటారు. మొదట అమ్మవార్లకు నిర్వహించే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం కొత్తగా కట్టిన గద్దెలు, తోరణాలు, టెక్నాలజీ మోడల్ టెంపుల్ను ప్రారంభిస్తారు. జాతర పర్యవేక్షణకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభిస్తారు. ఐదు గంటలకు క్యాబినెట్ మీటింగ్లో పాల్గొంటారు. తర్వాత మేడారం పరిసర ప్రాంతాలు జంపన్న వాగు, ఆర్టీసీ బస్టాండ్, మ్యూజియంతోపాటు పలు అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. రాత్రి అక్కడే హరిత హోటల్లో బస చేస్తారు. మరుసటి రోజు సోమవారం (19 న) ఉదయం మేడారం అభివృద్ధి పనుల పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరుతారు.


