కిషోర్ కుమార్ సేవలు మరువలేనివి : కలెక్టర్ భవేష్ మిశ్రా

కలం, నిర్మల్ : జిల్లాకు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ గా కిషోర్ కుమార్ (Nirmal Collector Bhavesh Mishra) అందించిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ వరంగల్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాలిగ్ అహ్మద్, ఏడి ల్యాండ్ సర్వే రికార్డ్స్ నరసింహమూర్తి పదవీ విరమణ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కిషోర్ కుమార్ రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా భూ సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోళ్లు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లను సకాలంలో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయడంలో ఆయన కీలకంగా పనిచేశారని అభినందించారు.

వరంగల్ జిల్లాలోనూ ఇదే అంకితభావంతో పనిచేసి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>