కలం, స్పోర్ట్స్ : వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత, 2027 ప్రపంచకప్ (ODI World Cup 2027)లో ఎలాగైనా కప్పు కొట్టాలని భారత జట్టు కంకణం కట్టుకుంది. అయితే ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి తరచూ గాయాలపాలవుతుండటంతో మిడిలార్డర్ సమతుల్యత దెబ్బతింటోంది. ప్రధాన బౌలర్లపై భారం పడకుండా ఉండాలంటే పార్ట్ టైమ్ బౌలింగ్ చేయగల బ్యాటర్లు జట్టుకు అత్యవసరంగా మారారు. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ అన్ టెస్టింగ్.. రేసులో తిలక్హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మిడిలార్డర్‌లో బలమైన ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు.
శ్రేయస్ అయ్యర్ గతంలో గాయపడటం, వేగవంతమైన పిచ్‌లపై అతడి ఆటతీరు ఇంకా నిరూపితం కాకపోవడంతో తిలక్ వర్మ వైపు బీసీసీఐ మొగ్గు చూపుతోంది. ఒత్తిడిలోనూ నిలకడగా రాణించడం, పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ వేయగలగడం తిలక్‌కు కలిసివచ్చే అంశం. సీనియర్ల వయస్సు, ఫిట్‌నెస్ సమస్యలురాబోయే ప్రపంచకప్ నాటికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్ల వయస్సు పెరగనుంది. అలాగే రవీంద్ర జడేజా ఎంపికపై అనిశ్చితి నెలకొంది.
జట్టులో ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా తగ్గుతుండటంతో దక్షిణాఫ్రికాలోని వేగవంతమైన పిచ్‌లకు తగ్గట్టుగా యువ ఆటగాళ్లను సిద్ధం చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రాబోయే షెడ్యూల్.. వరల్డ్ కప్ రోడ్‌మ్యాప్సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆసియా క్రీడల్లో మన టి20 జట్టు ఆడనుండటంతో కొందరు సీనియర్లు విండీస్ సిరీస్‌కు దూరమవ్వొచ్చు. అక్టోబర్‌లో జరిగే న్యూజిలాండ్ వన్డే సిరీస్ నుంచి 2027 ప్రపంచకప్ ప్రణాళికలు వేగవంతం కానున్నాయి.

