దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా విషాదం: 9 మంది దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Rajasthan Accident)లో 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కోటా-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై శంభుపుర సమీపంలో ఆగి ఉన్న లారీని యాత్రికులతో వెళ్తున్న వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

ప్రమాద సమయంలో వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన 16 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ఖాటు శ్యామ్ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి మహారాష్ట్రకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై అదనపు జిల్లా కలెక్టర్ రాజేష్ జోషి స్పందిస్తూ, అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని, ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించడం బాధాకరమని తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి వారిని కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత అని, మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>