రాజకీయాల్లోకి టీమిండియా క్రికెటర్​.. మోదీ, చాహల్​ పాత వీడియో వైరల్​

కలం, వెబ్​ డెస్క్​: భారత క్రికెటర్​ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్​ పాల్​ మౌర్యతో భేటీ అయ్యారు. అనంతరం చాహల్​ ను ఓబీసీ మోర్చా కార్యవర్గ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. బీజేపీ చీఫ్​ నితిన్ నబీన్ ఆదేశాలతో నియామకం చేపట్టారు. బీజేపీలో చేరడంపై చాహల్​ సోషల్​ మీడియా వేదికగా స్పందించారు. బీజేపీ కుటుంబంలో తనకు స్థానం, గౌరవం కల్పించినందుకు ప్రధాని మోదీ, అమిత్​ షా, నితిన్​ నబీన్​, అమర్​ పాటిల్​ మౌర్యలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మోదీ, చాహల్​ పాత వీడియో వైరల్​..

ఇండియన్​ స్పిన్నర్​ చాహల్​ బీజేపీలో చేరడంతో మోదీని ఆయన (Yuzvendra Chahal) కలిసిన పాత వీడియో వైరల్ అవుతోంది. టీమిండియా 2024లో టీ20 ప్రపంచ కప్​ గెలిచిన సందర్భంగా భారత జట్టు సభ్యులు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా చాహల్​ సైతం మోదీ దగ్గరకు వెళ్లారు. అప్పుడు చాహల్​ ఎందుకు సీరియస్​ గా ఉన్నావని ప్రధాని ప్రశ్నించారు. దీంతో టీం సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. ఆ సమయంలో మోదీ మాట్లాడుతూ.. హర్యాణా ప్రజలు చాలా ఆనందంగా ఉంటారని, ప్రతి విషయంలోనూ సంతోషం వెతుక్కుంటారని తెలిపారు. కాగా, టీమిండియా క్రికెకటర్లు గౌతమ్​ గంభీర్​, రవీంద్ర జడేజా కూడా ఇప్పటికే బీజేపీలో కొనసాగుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>