Mobile Popup Ad
Mobile Popup Ad

ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులకు ‘లీవ్ ఇండియా’ నోటీసులు

కలం, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌ (Rajasthan) లో  క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) సోమవారం ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులకు “లీవ్ ఇండియా”(Leave India) నోటీసులు జారీ చేసింది. పుష్కర్‌(Pushkar) లోని పలు ప్రజా ప్రదేశాల్లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా స్టిక్కర్లు అతికించినందుకు ఈ చర్య తీసుకున్నారు. ఆ స్టిక్కర్లపై “ఫ్రీ పాలస్తీన్, బాయ్‌కాట్ ఇజ్రాయెల్” వంటి నినాదాలు ఉన్నాయి.

జనవరి 21న పుష్కర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఈ స్టిక్కర్లు కనిపించడంతో స్థానిక అధికారులు అప్రమత్తమై CIDకి సమాచారం అందించారు. అనంతరం విచారణ చేపట్టిన అధికారులు, ఈ చర్యలు స్థానిక సున్నిత భావాలను దెబ్బతీయడమే కాకుండా పర్యాటక వీసా నిబంధనలకు విరుద్ధమని నిర్ధారించారు.

CID అదనపు ఎస్పీ రాజేశ్ మీనా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇద్దరు వ్యక్తులు పర్యాటక వీసాలపై భారత్‌కు వచ్చిన లూయిస్ గాబ్రియెల్ డీ (36), అనుయేషి ఎమ్మా క్రిస్టిన్ (36) గా గుర్తించారు. వీసా నిబంధనలు ఉల్లంఘించినందున వారిని దేశం విడిచిపోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>