Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం అథ్లెట్ల చిరకాల వాంఛ.. అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రాక్

కలం, ఖమ్మం బ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణంలో ఉన్న అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ఖమ్మం అథ్లెట్ల (Khammam Athletes) చిరకాల వాంఛ నెరవేర్చాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న 400 మీటర్ల అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసి, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా సింథటిక్ ట్రాక్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఖమ్మం జిల్లాలో క్రీడా వసతులను మెరుగు పరచడం ద్వారా జాతీయ స్థాయి పోటీలను నిర్వహించే స్థాయికి తీసుకెళ్లాలని, దీని ద్వారా స్థానిక అథ్లెట్లకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అలాగే జాతీయ స్థాయి పోటీలకు అథ్లెట్లను సిద్ధం చేయాలన్నారు. అనంతరం మంత్రి ఖమ్మం నగరం 18వ డివిజన్ లో పర్యటించి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శ్రీ రామ్ హిల్స్ లో కోటి 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ అధికారులు, జిల్లా యువజన, క్రీడల అధికారి తుంబూరు సునీల్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>