Mobile Popup Ad
Mobile Popup Ad

టీ తాగుదామని తీసుకెళ్లి.. బీటెక్ విద్యార్థినిపై దారుణం!

కలం, వెబ్‌ డెస్క్‌ : హైదరాబాద్‌ మహేశ్వరం (Maheshwaram) పోలీస్ డివిజన్ పరిధిలో ఒక షాకింగ్‌ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీ తాగుదామని నమ్మించి తీసుకెళ్లిన తోటి విద్యార్థి, ఒక యువతిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఉడుతల ఉదయ్ తన క్లాస్‌మేట్ అయిన బీటెక్ విద్యార్థినిని కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు తీసుకువెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బి.డి.ఎల్. (BDL) రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే ఆమెకు బలవంతంగా మద్యం తాగించాడు.

ఆ తర్వాత పూర్తిగా మత్తులోకి జారుకున్న బాధితురాలిని ఒక గదికి తరలించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఈ నెల 14న జరగ్గా, మానసిక ఆందోళనలో ఉన్న బాధితురాలు ఆలస్యంగా తేరుకుని ఈ నెల 17న పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహేశ్వరం డీసీపీ పరిధిలోని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉడుతల ఉదయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతడిని రిమాండ్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>