కలం, వెబ్ డెస్క్: డీలిమిటేషన్ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తీరుపై ఆయన ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డీలిమిటేషన్ పేరుతో బీజేపీ కొత్త మోసానికి తెరతీసిందని రాహుల్ ఆరోపించారు. ఈ ప్రక్రియలో రాష్ట్రాల వాటా అసలు విషయం కాదని చెప్పారు. నియోజకవర్గాల హద్దులు మళ్లీ నిర్ణయించడం అంటే బీజేపీకి బ్లాంక్ చెక్ ఇవ్వడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. వారి జనాభా పెరుగుతున్నా సీట్లు మాత్రం పెరగవని రాహుల్ గాంధీ తెలిపారు. పార్లమెంట్ లో 850 స్థానాల పెంపు అంటే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే నెంబర్ అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లను సాకుగా చూపి లోక్ సభ స్థానాలను పెంచాలని చూస్తున్నారని విమర్శించారు. ఉమెన్స్ రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిందని గుర్తు చేసిన రాహుల్ (Rahul Gandhi).. ప్రస్తుత సీట్లతోనే దాన్ని అమలు చేయొచ్చని స్పష్టం చేశారు.
Also Read : డీలిమిటేషన్‌కు స్టాలిన్ మద్దతు.. ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే?
Follow Us On : WhatsApp

