ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు మల్లు రవి కీలక హామీ

కలం, నాగర్‌క‌ర్నూల్: నేషనల్ హెల్త్ మిషన్‌లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త‌న‌ వంతు కృషి చేస్తానని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి (MP Mallu Ravi) తెలిపారు. శనివారం నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో కలిసిన ఎన్‌హెచ్ఎం ఉద్యోగులకు ఆయన భరోసా కల్పించారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలపై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణకు జేఏసీ ప్రతినిధుల తమ సమస్యలను వివరించారు. 32 రోజుల సమ్మె కాలపు వేతనాలు వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నారు. 100 శాతం గ్రాస్ శాలరీ అమలు చేయాలని ఈ సందర్భంగా మల్లు రవికి జేఏసీ నేతలు విన్నవించారు.

క్యాడర్ ఫిక్సేషన్ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని జేఏసీ నేతలు ఆయనకు తెలిపారు. ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలని, ఎన్‌హెచ్ఎం జేఏసీ నేతలు కోరారు. ఈ విషయమై స్పందించిన మల్లు రవి కమిషనర్‌తో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను సంబంధిత శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్తానని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా జనరల్ సెక్రటరీ దామగట్ల కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకోజు శ్రీనివాసులు, అడ్వైజర్ రేనయ్య, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>