బాసర ట్రిపుల్ ఐటీలో ఎన్‌-జెన్ పోస్టాఫీస్ ప్రారంభం..

కలం, బాసర: విద్యార్థుల్లో పొదుపు అలవాటును పెంపొందించడంతో పాటు ఆధునిక తపాలా సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో శనివారం ఎన్‌-జెన్ పోస్టాఫీస్‌ను (N-Gen Post Office) విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చిన్న మొత్తాలతో పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. నేటి పొదుపు భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు పునాది అవుతుందని పేర్కొన్నారు.

నిజామాబాద్ డివిజన్ పోస్టాఫీసుల సీనియర్ సూపరింటెండెంట్ ఎ. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. పోస్టాఫీసుల ద్వారా బ్యాంకింగ్, బీమా, ఆధార్, పాస్‌పోర్ట్, డిజిటల్ చెల్లింపులు, పార్శిల్ తదితర ఆధునిక సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. విద్యార్థులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్. రాజేశ్వర్, భైంసా ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్ జె. దిలీప్ కుమార్, పోస్టల్ అధికారులు, సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>