జమ్మిచేడులో పిచ్చి కుక్క స్వైర విహారం.. 15 మందిపై దాడి

కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) మున్సిపాలిటీ పరిధిలోని జమ్మిచేడు (Jammichedu) గ్రామంలో మంగళవారం ఉదయం పిచ్చికుక్క స్వైర విహారం చేసి.. 15 మందిపై దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండటంతో కుక్క కాటుకు గురైన వారందరికీ వైద్య సిబ్బంది చికిత్స అందించారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. గ్రామంలో సుమారు 20 పైగా కుక్కలు ఉన్నాయని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా గద్వాల పట్టణం భీంనగర్, గంజిపేట, నల్లకంట తదితర కాలనీలో గుంపులు గుంపులుగా పిచ్చి‌ కుక్కలు తిరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>