ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ మోహ‌న్ నాయ‌క్ స‌స్పెండ్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: అక్ర‌మాస్తుల కేసులో అరెస్ట్ అయిన ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ మోహ‌న్ నాయ‌క్‌ (Mohan Naik)ను స‌స్పెండ్ చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇటీవ‌ల మోహ‌న్ నాయ‌క్ ఇంటిపై ఏసీబీ (ACB) అధికారులు దాడులు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడుల్లో ఆయ‌న ఇంట్లో సుమారు రూ.200 కోట్ల‌కు పైగా అక్ర‌మాస్తుల‌ను గుర్తించారు. భారీ ఎత్తున న‌గ‌దు, బంగారం, భూ ప‌త్రాల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైద‌రాబాద్‌, నిజామాబాద్‌, ఇత‌ర ప్రాంతాల్లో మోహ‌న్ నాయ‌క్‌కు విల్లాలు, అపార్ట్‌మెంట్లు, వ్య‌వ‌సాయ భూములు ఉన్న‌ట్లు అధికారుల విచార‌ణ‌లో తేలింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు. అనంత‌రం ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌గా 14 రోజుల రిమాండ్ విధించింది. ప్ర‌స్తుతం మోహ‌న్ నాయ‌క్ చంచ‌ల్‌గూడ జైలులో ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>