పులివెందులలో ఉద్రిక్తత: రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి!

కలం, వెబ్ డెస్క్ : కడప జిల్లా పులివెందుల (Pulivendula) నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తుమ్మలపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు, సోడా బాటిళ్లతో దాడులకు దిగడంతో ప్రాంతం రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

మరోవైపు అరసవల్లి, ఎర్రిపల్లి గ్రామాల వద్ద ఓటు వేసేందుకు వెళ్తున్న తమను పోలీసులు, టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో వైసీపీ ఏజెంట్లకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత పురపాలక ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఎర్రిపల్లి పోలింగ్ బూత్ వద్ద పెట్రోల్ బాంబులు విసరడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.

అలాగే రైల్వేకోడూరు పరిధిలోని పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో పోలీసుల సమక్షంలోనే వైసీపీ శ్రేణులపై దుండగులు పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ వరుస ఘటనలతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొనగా, అధికారులు సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>