ఐఐఎం కలకత్తా బోర్డు ఛైర్మన్‌గా ప్రొఫెసర్ ఎం. జగదీష్ కుమార్

కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా వాసికి మరో అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో అత్యున్నత పదవిని అధిష్టించారు. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐఎం కలకత్తా (IIM Calcutta) బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ (Mamidala Jagadesh Kumar) నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ జగదీష్ కుమార్ ఈ పదవిలో నాలుగేళ్ళ పాటు కొనసాగనున్నారు. ఐఐఎం కలకత్తా వంటి ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్ విద్యాసంస్థకు బోర్డు ఛైర్మన్‌గా ఒక తెలుగు వ్యక్తి, అందులోనూ తెలంగాణ వాసి ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఇదిలావుంటే.. జగదీష్ కుమార్ స్వస్థలం నల్లగొండ (Nalgonda) జిల్లా తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామం. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఆయన జాతీయ స్థాయి విద్యా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రొఫెసర్ జగదీష్ కుమార్ గతంలో పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్మన్‌గా దేశవ్యాప్త విద్యా సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) వైస్ ఛాన్సలర్‌గానూ సేవలు అందించారు. ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తికి జాతీయ స్థాయిలో ఇటువంటి కీలక పదవి దక్కడంతో జిల్లా వాసులు, విద్యావేత్తలు, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>