Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతి శనివారం విజయ విహార్​లో కల్చరల్ ప్రోగ్రామ్స్

కలం, నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్​లోని తెలంగాణ టూరిజం విజయ విహార్ (Vijaya Vihar) అతిథి గృహంలో ఈ నెల 7 నుంచి ప్రతి శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు  ఏర్పాట్లు చేసినట్లు విజయ విహార్ మేనేజర్ కిరణ్ తెలిపారు. పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని టూరిజం వసతి గృహాల్లో పర్యాటకులను ఆహ్లాద పరిచేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా నాగార్జునసాగర్​లోని తెలంగాణ టూరిజం గెస్ట్​హౌస్​ విజయ విహార్​లోనూ ఈ నెల 7వ తేదీ నుంచి ప్రతి శనివారం బంజారా నృత్యాలు, కోలాటం లాంటి సంప్రదాయ కళలను సందర్శకుల కోసం ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. తెలంగాణ టూరిజం ‘స్వచ్ఛత’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయ విహార్ వసతి గృహం పరిసరాల్లో పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>