Mobile Popup Ad
Mobile Popup Ad

టీఎంసీకి రాష్ట్ర‌ప‌తి అపాయింట్‌మెంట్ తిర‌స్క‌ర‌ణ‌

క‌లం, వెబ్ డెస్క్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను కలిసేందుకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి భవన్ తిరస్కరించింది. తమ పార్టీ ప్రతినిధుల బృందానికి సమయం కేటాయించాలని తృణమూల్ కోరగా, ప్రస్తుతం రాష్ట్రపతికి సమయం లేకపోవడంతో అపాయింట్‌మెంట్ ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్రపతి కార్యాలయం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు తృణమూల్ నేతలు ఈ భేటీని కోరారు. అయితే, రాష్ట్రపతి షెడ్యూల్ బిజీగా ఉండటం వల్ల ఇప్పుడప్పుడే అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఇటీవ‌ల బెంగాల్‌కు వ‌చ్చిన రాష్ట్ర‌ప‌తికి చేదు అనుభ‌వం ఎదురైంది. దీనిపై బ‌హిరంగంగానే ఆమె సీఎంపై విమ‌ర్శ‌లు చేశారు. దేశ వ్యాప్తంగా ప‌లువురు నేత‌లు ఈ ఘ‌ట‌న‌ను ఖండించారు. రాష్ట్ర‌ప‌తిని ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వించాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా సూచించారు. మ‌రోవైపు బెంగాల్ సీఎం మ‌మ‌తా మాత్రం బీజేపీ రాష్ట్ర‌ప‌తిని అడ్డుపెట్టుకొని రాజ‌కీయం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్ర‌ప‌తి టీఎంసీ నేత‌ల‌కు అపాయింట్‌మెంట్ నిరాక‌రించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>