కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో శనివారం ప్రజానాట్యమండలి (Praja Natya Mandali) సమావేశం నిర్వహించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి సిర్ప లింగం ముఖ్య అతిథిగా హాజరై నూతన జిల్లా కమిటీని(New District Committee) ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా దుర్గం నూతన్‌కుమార్, అధ్యక్షుడిగా డాకూర్ తిరుపతి, కార్యదర్శిగా చింతకుంట శంకర్, ఉపాధ్యక్షుడిగా తొడసం శంభు, కోశాధికారిగా క్లెమెంట్ వెస్లీ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాల్లో ఆటపాటలు, మాటలు, కళారూపాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పాటలు, నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించవచ్చని తెలిపారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తూ, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

