లీకులు ఆపండి.. ఫౌజీ టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్

కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘ఫౌజీ’ (Fauzi). శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన లీకులపై చిత్రబృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సెట్స్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, వాటిని షేర్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సినిమా అధికారిక హ్యాండిల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో..  “సెట్స్‌కు సంబంధించిన లీక్ ఫొటోలు ప్రచారం చేస్తున్న కొన్ని అకౌంట్లు మా దృష్టికి వచ్చాయి. ఇది కఠిన హెచ్చరికగా పరిగణించాలి. ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.

ఇలాంటి లీకులు.. ప్రేక్షకులకు అందించాలనుకుంటున్న అనుభూతిని దెబ్బతీస్తాయని చిత్రబృందం తెలిపింది. బిగ్ స్క్రీన్‌పై చూపించబోయే విజువల్ ఎక్స్పీరియన్స్ మరింత గొప్పగా ఉంటుందని, అందుకు ప్రేక్షకులు కాస్త వేచి ఉండాలని కోరింది. అలాగే, లీక్ అయిన కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని, అలాంటి పోస్టులతో ఎంగేజ్ కాకూడదని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఈ ప్రకటనతో ‘ఫౌజీ’(Fauzi) సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. చిత్రబృందం తీసుకుంటున్న జాగ్రత్తలు, సినిమా స్థాయిని సూచిస్తున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>