బంకమట్టి ఉచితంగా అందించాలి.. కలెక్టర్‌కు కుమ్మరి సంఘం వినతి

కలం, వనపర్తి: సంప్రదాయ కుమ్మరి వృత్తిని పరిరక్షించడంతోపాటు వృత్తిదారులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతూ జిల్లా కుమ్మరి సంఘం నాయకులు (Potters) సోమవారం వనపర్తి (Wanaparthy) కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు రాములు కుమ్మర ఆధ్వర్యంలో సంఘం నాయకులు, కుల పెద్దలు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు.

కుమ్మరి వృత్తిదారులకు అవసరమైన బంకమట్టిని ఉచితంగా సేకరించేందుకు అనుమతులు మంజూరు చేయడంతోపాటు గ్రామాలకు తరలించేందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. కుండలు, ప్రమిదలు, దీపాలు, కూజాలు, మట్టి గణపతి విగ్రహాలు తదితర ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక మార్కెట్‌ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ పథకాల కార్యక్రమాలు, జాతరలు, ఉత్సవాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రదర్శనల్లో కుమ్మరులు తయారు చేసిన మట్టి ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ప్లాస్టిక్‌, ఇతర ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగం పెరగడంతో మట్టి పాత్రలకు డిమాండ్‌ తగ్గి కుమ్మరి కుటుంబాల జీవనోపాధిపై ప్రభావం పడుతోందని తెలిపారు. యువత సంప్రదాయ వృత్తిలో కొనసాగేందుకు శిక్షణ, ఆర్థిక సాయం, రుణ సదుపాయం, ఆధునిక పరికరాలు, మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కుమ్మరి వృత్తిని పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కుమ్మరి సంఘం నాయకులు, కుల పెద్దలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>