విద్యార్థులు లక్ష్య సాధనకు నిరంతరం కష్టపడాలి: పొన్నం

కలం, వెబ్ డెస్క్: ప్రతి విద్యార్థి జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని.. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కష్టపడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక సూచనలు చేశారు. విద్యార్థులు ఉన్నతంగా చదివి  ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్, అడ్వకేట్, లీడర్ కావాలని కలలు కనాలని.. ఉన్నత లక్ష్యాలను సాదించేందుకు కష్టపడి చదవాలన్నారు.

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో CSR స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. “యువ మేధస్సుకు ప్రోత్సాహం – ఉజ్వల భవిష్యత్తుకు బాట” అనే లక్ష్యంతో ఈ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను విద్యను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ CSRలో భాగంగా మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించడం అభినందనీయమని కొనియాడారు. కార్మికుల పిల్లలు విద్యలో ప్రతిభ కనబరచి ఉన్నత స్థాయికి ఎదగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రవాణా రంగంలో పనిచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారని అన్నారు.

విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల కష్టానికి తగిన గౌరవం తీసుకురావాలని కోరారు. మీరు పొందుతున్న స్కాలర్‌షిప్‌ను ఒక మెట్టుగా భావించి, మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కష్టపడాలని చెప్పారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే. అబ్దుల్ కలాం సూచించినట్లుగా కలలు కనాలని, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డా. జి. ముకుంద్ రెడ్డి, IAS, రక్షిత కె. కృష్ణమూర్తి, IPS, కుమార్ మొలుగారం, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుదర్శన్ హొల్లా బాల్నాడ్, సుమారు 750 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, గార్డియన్లు, ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>