కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ (Ankapur) గ్రామాన్ని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) సందర్శించారు. అంకాపూర్ లో కొనసాగుతున్న డబుల్ బెడ్ రూముల నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే సొంత గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ నిర్మాణం త్వరితగతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
పనులను వేగవంతం చేస్తూ, నాణ్యత ప్రమాణాలు పాటించాలని పొంగులేటి ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ లో నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గతం ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ కట్టినా పంపిణీ మాత్రం చేయలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను మిగులు లబ్ధిదారులకు అవసరం మేరకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా డబ్బులు అందజేసి పంపిణీ చేయాలని ఎమ్మెల్యే కోరడంతో అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఆలూరు ఎమ్మార్వో కార్యాలయం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాని మంత్రిని రాకేష్ రెడ్డి కోరారు. స్పందించిన మంత్రి పొంగులేటి.. నిధులు మంజూరుకు అనుకూలంగా స్పందిస్తూ హామీ ఇచ్చారు.

