కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti Srinivas Reddy) సంబంధించిన ఈడీ సోదాల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగి రెండేళ్లు పూర్తయినప్పటికీ తదుపరి చర్యలు, దర్యాప్తు వివరాలను ఎందుకు వెల్లడించలేదని వారు ప్రశ్నించారు.
ఈ అంశంపై ఈడీ అధికారులను కలిసి తమ అభ్యంతరాలు, డిమాండ్లను తెలియజేసేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు(BRS Leaders) కార్యాలయానికి వెళ్లారు. 2024 సెప్టెంబర్ 27న పొంగులేటి(Ponguleti)కి సంబంధించిన 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగినట్లు అప్పట్లో వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.
నేతలను అడ్డుకున్న పోలీసులు
ఈడీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ (MLA Sanjay), కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం వెలుపలే బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. సోదాల అనంతరం దర్యాప్తు పురోగతిపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఈడీ చర్యల విషయంలో పారదర్శకత పాటించాలని కోరారు. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కూడా ఈడీ సోదాలకు రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో దర్యాప్తు వివరాలపై ప్రశ్నలు లేవనెత్తారు.
Also Read : ఖైరతాబాద్ ఉప ఎన్నికపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

