ఆటోను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి!

కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Mancherial Accident ) చోటుచేసుకుంది. నస్పూర్ గేట్ ఏరియా జాతీయ రహదారిపై లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్పూర్ గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆటో ప్రయాణికులతో వెళ్తుండగా, లారీ రాంగ్ రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆటో నుజ్జునుజ్జయ్యి ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారిని మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి చెందిన సౌందర్య, రవ్య, రవళిగా గుర్తించారు. వీరూ మంచిర్యాల పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం అందుతోంది.  ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే నస్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని వెంటనే చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>