ఖైరతాబాద్ ఉప ఎన్నికపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : ఖైరతాబాద్ ఉప ఎన్నికపై దానం నాగేందర్ (Danam Nagender) కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో (Khairatabad Bypoll) విజయం తనదేనని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు చేసిన నిరసన కార్యక్రమంలో దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ, ‘సర్’ తర్వాత జరగనున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు తనదేనని స్పష్టం చేశారు.

మరోవైపు బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా కేవలం ‘ఓటు చోరీ’ రాజకీయాల ఆధారంగానే ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని దానం నాగేందర్ (Danam Nagender) విమర్శలు గుప్పించారు. గడిచిన మూడు ఎన్నికల్లో కూడా బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడి విజయం సాధించిందని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఇదే తరహాలో ఓటు చోరీతోనే గెలిచారంటూ మండిపడ్డారు. అటు ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ దిట్ట అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీజేపీని కాపాడేందుకే బీఆర్ఎస్ సరికొత్త డ్రామాలకు తెరలేపుతోందని, అంతర్గతంగా ఆ రెండు పార్టీలూ ఒక్కటేనని విమర్శించారు. అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా ఖైరతాబాద్ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కడతారన్నారు.

Also Read : ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ నేతల నిరసన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>