Mobile Popup Ad
Mobile Popup Ad

మరో రెండు నెలల్లో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: నేటి నుండి రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. పేదల సొంతింటి కల సాకారంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. సోమవారం అసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కెరమెరి మండలం కొఠారి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇండ్లకు ఆయన గృహప్రవేశం చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నారు. కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదల దశాబ్దాల సొంతింటి కల సాకారంలో దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలుస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన కేవలం రెండున్నర సంవత్సరాలలోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను పేదలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని.. మరో రెండు నెలల్లో 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కానుందని ప్రకటించారు.

రెండవ విడతలోనూ గిరిజనులకు ఇండ్లు..

తండాలలో, గూడాలలో ఇండ్లు లేని వారు ఉండకూడదని.. వారి సొంతింటి కల నెరవేరుస్తామని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గిరిజిన, లంబాడి ప్రజలకు భరోసానివ్వడం జరిగిందని చెప్పారు. తొలి విడతలోనే ప్రాధాన్యతతో ఆదివాసి, గిరిజిన, లంబాడి ప్రజలు అధికంగా ఉన్న నియోజకవర్గాలకు 3500 ఇండ్లు.. అలాగే 1500 ఇండ్లు అధికంగా ఇచ్చి వారి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించామన్నారు. ఇప్పుడు రెండవ విడతలో కూడ గిరిజన ప్రాంత పేదవారికి ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించామని తెలిపారు.

కులం, మతం, పార్టీ అనేది చూడలేదు..

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఎలాంటి వివక్ష చూపలేదని.. కులం, మతం, పార్టీ అనేది చూడలేదని అన్నారు. పేదవాడు అర్హుడైతే చాలు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి లేదా రెండు విడతలతో ముగిసిపోయే కార్యక్రమం కాదని.. రాష్ట్రంలోని ప్రతి అర్హ పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని ప్రకటించారు. రెండవ విడతలో భాగంగా నియోజకవర్గానికి 2500 ఇండ్ల చొప్పున కేటాయించడం జరిగిందన్నారు.

గత ప్రభుత్వాలలో ఇండ్లు పొంది నిర్మాణాలు ఆగిపోయిన వారి ఇండ్లు పూర్తి చేసుకునేందుకు సైతం ఈ విడతలో ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా మూడు, నాలుగు విడతలుగా ఈ ఇందిరమ్మ ఇళ్ల ను మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు.ప్రతిపక్ష నాయకులు సైతం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రశంసించాని.. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>