భద్రాద్రి జిల్లాలో ఆన్ సైట్ ఎఫ్ఐఆర్..

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ పోలీసులు ఆన్ సైట్ (On Site FIR) ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. అంటే సంఘటన జరిగిన ప్రదేశానికే పోలీసులు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. చంద్రుగొండ మండలం జర్పూల్ తండాకు చెందిన గూగులోత్ రాములు అనే మేకల కాపరి, తన మేక దొంగతనం జరిగిన విషయాన్ని ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ విధానంలో ఫిర్యాదు చేశాడు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ, ఎస్పీ సూచనల మేరకు చంద్రుగొండ పోలీసులు స్వయంగా బాధితుని దగ్గరకు వెళ్లి, సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని బాధితునికి అందచేశారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ (On Site FIR) విధానాన్ని అమలు చేస్తున్నామని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, వృద్ధులు, పోలీస్ స్టేషన్‌కు స్వయంగా రావడానికి ఇబ్బంది పడే బాధితులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>