త్రిష‌, విజ‌య్‌పై కామెంట్స్‌.. ఉద‌య‌నిధి ఇంటికి పోలీసులు!

క‌లం, వెబ్‌డెస్క్‌: చెన్నైలో డీఎంకే నేత ఉద‌య‌నిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ఇంటి వ‌ద్ద హై టెన్ష‌న్ నెల‌కొంది. ఇటీవ‌ల ఆయ‌న సీఎం విజ‌య్‌, న‌టి త్రిష‌పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదానికి దారి తీశాయి. విజ‌య్ కావేరీ జ‌లాల కోసం ఎదురు చూడ‌టం లేద‌ని, త‌న ఇంటికి త్రిష ఎప్పుడు వ‌స్తుందా? అని ఎదురుచూస్తున్నార‌నే అర్థం వ‌చ్చేలా ఉద‌య‌నిధి వ్యాఖ్యానించారు. దీనిపై టీవీకే శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చాయి. ఈ నేప‌థ్యంలో టీవీకే కార్య‌క‌ర్త‌లు ఉద‌య‌నిధి ఇంటిని ముట్టడించేందుకు త‌ర‌లివ‌చ్చారు. అదే స‌మ‌యంలో డీఎంకే కార్య‌క‌ర్త‌లు సైతం భారీ ఎత్తున ఉద‌య‌నిధి ఇంటికి చేరుకున్నారు.

ఇరు పార్టీల ఆందోళ‌న న‌డుమ పోలీసులు ఉద‌య‌నిధి ఇంటికి వ‌చ్చారు. ఉద‌య‌నిధిని అరెస్ట్ చేసేందుకే పోలీసులు వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఈ వివాదంపై జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌కు టీవీకే ఫిర్యాదు చేసింది. మ‌రోవైపు తంజావూర్ పోలీస్ స్టేష‌న్‌లో సైతం కేసు న‌మోదైంది. ఈ వివాదంపై డీఎంకే పార్టీ మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్రియించింది. ఉద‌య‌నిధిని అరెస్ట్ చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కోర్టు నేడు మ‌ధ్యాహ్నం ఈ పిటిష‌న్‌ను అత్య‌వ‌స‌ర విచార‌ణ కింద తీసుకొని విచారించ‌నుంది. కోర్ట్ తీర్పుపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>