బాసర లాడ్జిలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర (Basara) పరిధిలోని పలు లాడ్జిలపై పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా లాడ్జిల గదుల రిజిస్టర్లు, అతిథుల వివరాలు, నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గదులు కేటాయించే సమయంలో అతిథుల ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని లాడ్జి నిర్వాహకులకు సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులకు గదులు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు ఆశ్రయం కల్పిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ముధోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర సీఐ దీపక్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>