మానసిక దివ్యాంగులు అధైర్య పడొద్దు : కమిషనర్ సాయి చైతన్య

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తారకరామా నగర్‌లో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన విలీన విద్యా కేంద్రం ప్రారంభం అయింది. ఆటిజం ,హైపర్ ఆక్టివ్ డిసార్డర్ చదువులో వెనుకబాటుతనం విద్యార్థుల ఉన్నతి కోసం నూతనంగా ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) హాజరై నూతన భవనంలోని తరగతి గదులను ప్రారంభించారు.

దివ్యాంగ విద్యార్థులకు అందించే విద్య ఇతర విషయాలను భవనంలోని తరగతి గదులను పరిశీలించి ఏ విధంగా వారికి వ్యాయామం, శిక్షణ విద్య అందిస్తున్నారు ఉపాధ్యాయులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్య మాట్లాడుతూ భగవంతుడు మనకు ఏ విధంగా జన్మనిచ్చినప్పటికీ మనకు అంగవైకల్యం , మానసిక బుద్ధిమాంద్యం లాంటివి ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదన్నారు.

భగవంతుడు ఇచ్చిన జన్మలో మనం ఏం సాధించ గలుగుతామని అనే దిశగా అడుగులు వేసి ముందుకు వెళ్లాలని మనో ధైర్యాన్ని కల్పించారు. అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు అంగవైకల్యంతో జన్మించారని నిరుత్సాహపడరాదని తెలిపారు. ముఖ్యంగా వారిని జన్మించిన తరువాత వారి నడవడికను గమనించి సరైన వైద్యులచే వైద్యంతో పాటు సదరు బాలుడు ఆసక్తి ఏ వైపు చూపుతున్నాడో గమనించి ఆ దిశగా సరైన ప్రోత్సాహాన్ని అందిస్తే ఉన్నత శిఖరాలు సైతం అధిరోహించడం సాధ్యమవుతుందన్నారు.

ఒక ఇంట్లో ఒక్కరు దివ్యాంగుడు ఉన్నప్పటికీ భరించలేక నిర్లక్ష్యం వహించిన ఘటనలు లేకపోలేవన్నారు. అలాగే సకలాంగులైనప్పటికీ వారిని సరైన నడవడికలు నడిపించకపోవడంలో తల్లిదండ్రుల వైఫల్యం కూడా అంతే ఉంటుందన్నారు.. అలాంటిది ఒక మానసిక దివ్యాంగ విద్యార్థుల ఉన్నతి కోసం కొన్ని సంవత్సరాలుగా వారి నడవడికను గమనిస్తూ వారి తల్లిదండ్రుల ప్రోద్బలంతో దివ్యాంగుల ఉన్నతి కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు సిద్దయ్య, జ్యోతి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

తమ పోలీస్ శాఖ తరపున సైతం దివ్యాంగుల ఉన్నతి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని సూచించారు. పోలీస్ శాఖకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకోని పోలీస్ పనితీరు అలాగే పోలీస్ శాఖ ఏ విధంగా పనిచేస్తుందని విషయాలు పట్ల విద్యార్థులకు కూడా తెలియపరుస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్య, లోకల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కొండారెడ్డి వైస్ చైర్మన్ కనకయ్య మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>