కలం, వెబ్ డెస్క్ : పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత ప్రభుత్వం అన్ని లిమిట్స్ ను క్రాస్ చేసిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత సిగ్గుచేటు అన్నారు. సంతాల్ సంస్కృతిని మమత ప్రభుత్వం అవమానించిందంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి పదవి రాజకీయాల కంటే ఉన్నతమైనదని.. అలాంటి పదవిని గౌరవించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
రాష్ట్రపతి పర్యటనలో మమత ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘించిందని.. బిధాన్ నగర్ లో జరగనున్న ఇంటర్నేషనల్ సంతల్ సదస్సు వేదికను అకస్మాత్తుగా మార్చారంటూ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) విమర్శించారు. ఉత్తర బెంగాల్ లో జరగాల్సిన సంతల్ సదస్సుకు పర్మిషన్ ఇవ్వకుండా రాష్ట్రపతిని కావాలనే అవమానించారని ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే విషయంపై రాష్ట్రపతి ద్రౌపది కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో టీఎంసీ ప్రభుత్వంలోని మంత్రులు ఎవరూ ప్రోటోకాల్ పాటించినట్టు అనిపించలేదన్నారు.
Read Also: కామారెడ్డిలో కలకలం.. ఐదుగురు చిన్నారులు మిస్సింగ్
Follow Us On: Youtube

