Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు మ‌లేషియాకు మోడీ.. ద్వైపాక్షిక సంబంధాల‌పై చ‌ర్చ‌లు

క‌లం, వెబ్ డెస్క్‌: భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (PM Modi) నేడు మ‌లేషియా (Malaysia)కు బ‌య‌లుదేరారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం మ‌లేషియాకు వెళ్తున్న‌ట్లు ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సముద్ర భద్రత త‌దిత‌ర‌ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కీల‌క చ‌ర్చ‌లు జ‌రుప‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మోడీ ఎక్స్ వేదిక‌గా చేసిన పోస్ట్‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నా స్నేహితుడు, మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రాహీం ఆహ్వానంతో మలేషియాలోని కౌలాలంపూర్ (Kuala Lumpur) వెళ్తున్నా అంటూ మోడీ పేర్కొన్నారు.

భారత్‌తో మలేషియాకు ఉన్న సాంప్రదాయిక, విస్తృత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుంద‌ని చెప్పారు. ఈ సందర్శన ద్వారా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతుంద‌న్నారు. వివిధ రంగాల్లో సహకారం మరింత పెరుగుతుంద‌ని తెలిపారు. మలేషియాలో భారతీయుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని మోడీ (PM Modi) వెల్ల‌డించారు. గ‌తంలో మోడీ 2015లో మలేషియాలో పర్యటించారు.

Read Also: మానస సరోవరం యాత్రకు మూడో మార్గం : కేంద్రం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>