కలం, వెబ్ డెస్క్: పేదరికాన్ని నిర్మూలించడంలో గత ప్రభుత్వాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ లోని ఐఐటీ ఖరగ్ పూర్ (IIT Kharagpur) డైమండ్ జూబ్లీ వేడుకలకు హాజరైన ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో పేదరిక నిర్మూలన కేవలం నినాదాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో సరైన విధానాలు అమలు చేయలేదని ఆరోపించారు.
గతంలో భారత్ లో పేదరికాన్ని శాశ్వత సమస్యగా భావించే వారని మోదీ చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని ఆయన (PM Modi) వెల్లడించారు. తమ పాలనలో సుమారు 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. భారత్ లో పేదరికం తగ్గుముఖం పట్టినట్లు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదిక తమకు మరింత ప్రోత్సాహాన్ని అందించిందని ప్రధాని తెలిపారు.
మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఎర్రకోట నుంచి పేదల కొసం మరుగుదొడ్డు నిర్మిస్తామని ప్రకటించిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రకటనపై అప్పుడు కొందరు ఎగతాళి చేశారన్నారు. అయితే, పేదలకు ముఖ్యంగా మహిళలకు మరుగుదొడ్లు అవసరం ఎంత ముఖ్యమో వారికి అర్ధం కాలేదని ఆయన విమర్శించారు. దేశం అభివృద్ధి కావాలంటే పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అత్యంత కీలకమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Also Read : ప్రతి హిందువు ఇంట్లో లైసెన్స్డ్ గన్ ఉండాలి: ఎమ్మెల్యే రాజా సింగ్
Follow Us On : WhatsApp

