కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ఈఎంఐ వివాదం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్న ఘటన మహారాష్ట్ర (Maharashtra) లోని శంభాజీనగర్ లో జరిగింది. కునాల్ మురళీధర్ చాంద్గుడే (19) మొబైల్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులతో జరిగిన గొడవపెట్టుచున్నాడు. కొత్త ఫోన్ కొనివ్వాలని పట్టుబట్టాడు.. వద్దు అని వారించిన తల్లిదండ్రులపై ఆగ్రహం పెంచుకున్నాడు.
అనంతరం సమీపంలోని తిస్‌గావ్ ప్రాంతంలోని ఖవాడ కొండపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. కొడుకును కాపాడేందుకు తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో తండ్రి మురళీధర్ చాంద్గుడే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు కునాల్ తో పాటు కొండనుంచి కిందికి జారిపడిపోయారు. దీంతో తల్లిదండ్రులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కళ్ల ముందే భర్త, కొడుకు చనిపోవడంతో షాక్ కు గురైన తల్లి సంగీత చాంద్గుడే కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు, భర్త పడిపోయిన చోటే ఆమె కూడా కొండపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో ఆప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న విషయంగా మొదలైన ఫోన్ వివాదం చివరకు కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
⚠️Three members of a family died following a dispute over a mobile phone. The 19-yr-old allegedly jumped off a rock. His father, trying to save him, fell down with him. His mother also jumped later on.
What generation is this?pic.twitter.com/XoaVvLMEITpic.twitter.com/EmMqswmSaH
— Keh Ke Peheno (@coolfunnytshirt) August 22, 2026

