పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం విషమం.. కొద్దిసేపట్లో హెల్త్ బులిటెన్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. సోమవారం వైద్యులు ఆయనకు 9 సార్లు సీపీఆర్ చేసినప్పటికీ ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు వెంటిలేటర్ పైనే ప్రత్యేక చికిత్సనందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి సీతక్క, ఇతర ముఖ్య నేతలు యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే మరికొద్దిసేపట్లో డాక్టర్లు పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనుండటంతో ఆందోళన నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>