ఎన్టీఆర్ జిల్లాలో పులి కలకలం.. అధికారులకు పవన్ కళ్యాణ్​ కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఈ విషయంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పులి కదలికలపై నిరంతరం నిఘా ఉంచి ప్రజలకు భద్రతా భరోసా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. పీసీసీఎఫ్ , చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించాలని సూచిస్తూ, స్థానిక అటవీ సిబ్బందితో పాటు ‘హనుమాన్’ బృందాలతో గస్తీ నిర్వహించాలని ఆదేశించారు.

అంతేకాదు పులి సంచార మార్గాలను కచ్చితంగా గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరా ట్రాప్‌ల వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనల ప్రకారం పులికి గానీ, ప్రజలకు గానీ ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకునేందుకు కార్యచరణ ఉండాలన్నారు. పులిని పట్టుకునేందుకు అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక నిపుణులు, రెస్క్యూ బృందాలను రప్పించాలని దిశానిర్దేశం చేశారు. పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా ముందస్తుగా అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖల అధికారులు అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>