Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఓజీ2’ పై క్రేజీ అప్‌డేట్.. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ వైరల్

కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ2’ (OG2) సినిమాపై తాజా అప్‌డేట్ బయటకు వచ్చింది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (Pawan Kalyan Creative Works) సంస్థ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

“మాటిచ్చినట్లే సినిమా చేస్తారు.. టైమింగ్ గురించి ఆయనే స్వయంగా చెబుతారు. దర్శకుడు సుజీత్ విదేశాల నుంచి తిరిగివచ్చిన తర్వాత ఈ విషయంపై చర్చిస్తాం” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ‘ఓజీ2’ ప్రాజెక్ట్‌పై మరింత క్లారిటీ వచ్చినట్లయింది. ప్రస్తుతం సుజీత్ విదేశాలలో ఉండగా, ఆయన రాగానే తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ చిన్న అప్‌డేట్ పవన్ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>