కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా అందోల్ (Andole) శివారులోని డంపింగ్ యార్డ్‌లో ‘బయో మెడికల్’ వ్యర్థాలను పారబోయడం స్థానికంగా కలకలం రేపింది. బయో మెడికల్ మాఫియా పటాన్‌చెరు నుండి బయో మెడికల్ వ్యర్థాలను, స్క్రాప్‌ను రహస్యంగా అందోల్‌కు తీసుకువచ్చి ఇష్టానుసారంగా తగులబెడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున పొగ వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.
స్థానికుల ఫిర్యాదుతో బయోమెడికల్ వ్యర్థాల ముఠాను పట్టుకునేందుకు అధికారులు నిఘా పెట్టారు. బుధవారం రెండు డీసీఎంలలో గుర్తు తెలియని వ్యక్తులు బయోమెడికల్ వ్యర్థాలు, స్క్రాప్ తెచ్చి డంప్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వెంటనే రెండు డీసీఎంలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం రూ.40 వేలు జరిమానా విధించారు.

