Mobile Popup Ad
Mobile Popup Ad

కల్తీ పాల ఘటనలో ల్యాబ్ రిపోర్టు.. షాకింగ్ నిజాలు

కలం, వెబ్ డెస్క్ : రాజమండ్రి కల్తీ పాల ఘటనలో (Milk Incident) ల్యాబ్ రిపోర్టు వచ్చింది. విషంతో సమానమైన ఇథలీన్ గ్లైకాల్ పాలల్లో కలిసిందని ల్యాబ్ రిపోర్టులో తేలిపోయింది. ఇథలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడం వల్లే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయి 10 మంది చనిపోయారని రిపోర్టు వెల్లడించింది. ఇంకా పది మంది వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవుతున్నాయని ఈ ల్యాబ్ రిపోర్టు బయటపెట్టింది. ఈ కేసులో పాల వ్యాపారి గణేశ్వర్ రావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. ఆయన మీద 9 కేసులు నమోదయ్యాయి.

ఏం జరిగిందంటే..?

రాజమండ్రిలో ఫిబ్రవరి 15న కల్తీ పాలు (Milk Incident) తాగి పదులకొద్దీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అందులో ఇప్పటి వరకు పది మంది ఆర్గాన్స్ ఫెయిల్ అయి చనిపోయారు. ఇంకా పది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపారు. పాలవ్యాపారి గణేష్ ఓ ఫ్రీజర్ ను పాలను కూల్ గా ఉంచడం కోసం వాడుతున్నాడు. ఆ ఫ్రీజర్ లీక్ అవుతుండటంతో దానికి ఎంసీల్ అతికించాడు. ఫిబ్రవరి 14న రాత్రి మూడు పాల క్యాన్ లను ఫ్రిజ్ లో ఉంచాడు. కానీ ఎంసీల్ అంటించిన చోటు నుంచి విషపూరితమైన ఇథలీన్ గ్లైకాల్ లీక్ అయి ఒక క్యాన్ పాలల్లో కలిసింది. మరుసటి రోజు గణేష్ దాన్ని చూసుకోకుండా రాజమండ్రిలోని పలు ఇండ్లలో పోశాడు. అవి తాగిన వారు ఆస్పత్రిలో చేరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>