రాజస్థాన్‌లో పాక్ కుట్ర భగ్నం.. భారీగా ఆర్డీఎక్స్, ఆయుధాలు సీజ్!

కలం, వెబ్ డెస్క్ : రాజస్థాన్ అనూప్‌గఢ్‌లో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన రావలా మండి పరిధిలోని 12 KND ప్రాంతంలో బీఎస్ఎఫ్, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాల గుట్టు రట్టయింది. సరిహద్దు దాటి పాకిస్థాన్ వైపు నుండి డ్రోన్ (Pakistan Drone ) ద్వారా అక్రమంగా తరలించిన మూడు సందేహాస్పద ప్యాకెట్లను భద్రతా బలగాలు గుర్తించాయి.

అయితే ఈ సోదాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వాధీనం చేసుకున్న ప్యాకెట్లలో రెండు చోట్ల అత్యంత ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ తో పాటు 2 అధునాతన పిస్టళ్లు, 4 మ్యాగజైన్లు, దాదాపు 650 తూటాలను బలగాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు డ్రోన్ ఆపరేషన్ కోసం ఉపయోగించే 4 జతల బ్యాటరీలు, 2 రిమోట్లు కూడా లభించాయి. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను ఘటనా స్థలంలోనే భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

దీంతో సరిహద్దు ప్రాంతాల గుండా ఉగ్రవాద లేదా విధ్వంసకర శక్తులు దేశంలోకి అశాంతిని సృష్టించేందుకు వేస్తున్న పన్నాగులను BSF, ANTF దళాల సమన్వయం మరోసారి విజయవంతంగా అడ్డుకుంది. ప్రస్తుతం అరెస్టైన నిందితులను విచారిస్తుండగా, ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరి కోసం ఆ ప్రాంతంలో ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>