కలం, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడు (Kambhampadu) లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. కంభంపాడు గ్రామంలో ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోకు మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో అతి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం, అతివేగంగా వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతుల్లో ఒకరు గుణిచింతలపాడు గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, మరొకరు పోలిశెట్టిపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా ప్రాథమిక సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

